సింగ సముద్రం చెరువు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగ సముద్రం చెరువు తెలంగాణలోని అరుదైన ట్యాంకులలో ఒకటి. ఈ అందాన్ని చూడటానికి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ ట్యాంక్ ఘంభిరావ్ పేట్ మండలంలో ఉంది మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ట్యాంక్ మొదట కాకతీయ యుగం నందు నిర్మించబడింది.
ఎలా చేరుకోవాలి? :
గాలి ద్వారా
రాజన్న సిరిసిల్ల జిల్లా కు విమానాశ్రయం లేదు.సమీపంలో సుమారుగా 150 కిలోమీటర్ ల దూరం లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.ఈ విమానాశ్రయం నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం 3గంటలు.
రైలులో
సమీప రైల్వే స్టేషన్ లు కరీంనగర్ మరియు కామారెడ్డి వద్ధ ఉన్నాయి.కరీంనగర్ 33.8 కి.మీ దూరంలో మరియు కామారెడ్డి 67.7 కి.మీదూరం లో ఉంది
రోడ్డు ద్వారా
హైదరాబాద్,కరీంనగర్,జగిత్యాల్, సిద్దిపేట,వరంగల్,కామారెడ్డి,నిజామాబాద్ కు అనుసంధానించే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ ప్పోర్ట్ కార్పొరేషన్ (టి ఎస్ ఆర్ టి సి )నడుపుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఘంభిరావ్ పేట్ మండల్ కు తరచూ బస్సులు ఉన్నాయి.