ముగించు

మహిళా & శిశు సంక్షేమ శాఖ

సఖి/వన్ స్టాప్ సెంటర్:

సంప్రదించవలసిన నెంబర్లు:

క్రమ సంఖ్య పేరు హోదా ఫోన్ నెంబర్ ఈమేల్ ఐడి
1 పి.లక్ష్మిరాజం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ 9491051714 dwosircilla@gmail.com
2 బి.రోజా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ 08723-295181,9441495181 sakhisiricilla@gmail.com

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ ఫండ్ ద్వారా, భారతదేశం అంతటా ప్రతీ జిల్లాలో సఖి/వన్ స్టాప్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల లో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వచ్చంద సంస్థ భూమికా ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్త ఆద్వర్యంలో సఖి సెంటర్ ని నవంబర్ 15 న 2019 లో ప్రారంభించడం జరిగింది.

ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు,హింసల నుండి రక్షణ కల్పించడానికి, అవసరమైన అన్నీ సహాయాలనుఅందించడానికి సఖి సెంటర్ కృషి చేస్తోంది.

  • గృహహింస
  • పనిచేసేచోట లైంగిక వేధింపులు
  • స్త్రీలు పిల్లలు అక్రమ రవాణా
  • విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు
  • అత్యాచారాలు
  • యాసిడ్ దాడులు మొదలైన హింస నుండి రక్షణ కల్పించడం,వారికి అవసరమైన సమస్త సహాయాలు ఒకేచోట నుండి అందించడo సఖి సెంటర్ ప్రత్యేకత.హఠాత్తుగా కట్టు బట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేసిన బాధిత స్త్రీల కోసం తాత్కాలిక వసతి,వారికి అవసరమైన వైధ్య సేవలు,వారి తరపున కేసులు నమోదు, పరిహారం, ఎఫ్‌ఐ‌ఆర్ చేయించడం లాంటి సదుపాయాలనను బాధిత స్త్రీల కు అందించి,వారు ఎదుర్కొంటున్న హింసల నుండి రక్షణ కల్పించడమే సఖి సెంటర్ ప్రధాన ఉద్ధేశం.

ఈ సేవలను అన్నింటిని ఉచితంగా అందించడానికి సఖి సెంటర్ర్లలో పూర్తిస్తాయి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు.ఒకసారి బాదిత స్త్రీ సఖి సెంటర్ కి వస్తే,సఖి సెంటర్ అన్నీ వేళల్లోనూ ఆమెకు తోడుగా ఉంటుంది.సెంటర్ నిర్వహణకు గాను సెంటర్ అడ్మినిస్ట్రేటర్,న్యాయపరమైన సలహాలు ఇవ్వడానికి లీగల్ కౌన్సిలర్,మానసిక స్టైర్యాన్ని,ధైర్యాన్ని ఇవ్వడానికి సోషల్ కౌన్సిలర్,వైద్య సేవలందించడానికి పారమెడికల్ సిబ్బంది24 గంటలు అందుబాటులో ఉండడం సఖి సెంటర్ ప్రత్యేకత,మొత్తంగా16 మండి సిబ్బంది ఉంటారు. అలాగే ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకోవడానికి,రక్షించడానికి 181 వాహనం కూడా అందుబాటులో ఉంటుంది.

సోషల్ లింక్స్:

ఫేస్ బుక్ : https://www.facebook.com/sakhi.centre.5

ట్విటర్ : https://twitter.com/sakhisiricilla