ముగించు

సంస్కృతి మరియు వారసత్వం

బతుకమ్మ :

బతుకమ్మ పండుగ సంప్రదాయం మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది .దసరా ఉత్సవాల్లో ఒక భాగం బతుకమ్మ తెలంగాణ కు ఒక ప్రత్యేకమైనది.ఈ రంగు రంగుల పండుగకు చరిత్రకు ప్రతీక,పర్యావరణ,సామాజిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది.మెరిసే దుస్తులు మరియు ఆభరణాలు ధరించిన మహిళలు అందంగా పేర్చబడిన బతుకమ్మలను తంగేడు,గునుగు,చామంతి మరియు ఇతర పూలతో గ్రామానికి లేదా వీధుల సమావేశ స్థలానికి తిసుకువెళతారు.బతుకమ్మ చుట్టూ మహిళలు జానపద పాటలు పడుతూ బతుకమ్మ ఆడుతారు.ఈ పాటలు పురాణాలు చరిత్ర మరియు నిర్దిష్ట ప్రాంతంలోని ఇటీవల రాజకీయ మరియు సామాజిక పరిణామాలలో కూడా మూలాలు ఉన్నాయి .సద్దుల బతుకమ్మ రోజు గ్రామస్తులు పూలతో అమర్చిన బతుకమ్మ ను సరస్సులో లేదా కొలనులలో వదిలి పెడతారు.