ముగించు

జిల్లా గురించి

పరిచయం :

సిరిసిల్ల అనే పేరు సిరిషాల నుండి వచ్చింది(అర్థం సంపద  కేంద్రం).ఇది భారత దేశం యొక్క తెలంగాణలోని  రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ఒక్క పట్టణం మరియు జిల్లా ప్రధాన కార్యలయం.ఇది సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ లోని సిరిసిల్ల మండలంలో మానేరు నది ఒడ్డున ఉంది.

అధిక సంఖ్యలో పవర్ లూమ్స్ ,టెక్స్టైల్ ప్రాసెసింగ్ మరియు డైయింగ్ యూనిట్లు ఉన్నందున దీనిని టెక్స్టైల్ టౌన్ అని పిలుస్తారు.

సివిక్ అడ్మినిస్ట్రేషన్ :

సిరిసిల్ల మున్సిపాలిటీ 1952 లో స్థాపించబడింది మరియు ఇప్పుడు 34 ఎన్నికల వార్డులతో మొదటి తరగతి మున్సిపాలిటీ గా వర్గీకరించబడింది( జి.ఓ 50,తారికు 08-03-2018 ప్రకారం).పౌర సంఘం యొక్క అధికార పరిధి 55.47కిలో మీటర్లు చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

 తేది : 18-04-2018 G.O.Ms.No.93, ప్రకారం సిరిసిల్ల పట్టణంలో కలపబడిన గ్రామాలు

  గ్రామము పేరు విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో)
 చంద్రంపేట 1.5
ముష్టిపల్లి 2.57
రగుడు  2
 పెద్దూర్ 9.73
చిన్న బోనాల 10.15
 బోనాల 10.16
 సర్దాపూర్ 4.11
మొత్తం 40.22

 

భౌగోళికం :

సిరిసిల్ల 18.38°N 78.83°E వద్ధ ఉంది,ఇది సగటున 322 మీటర్లు(1056 అడుగులు)ఉంది.ఇది సికింద్రాబాద్ నుండి 130 కిలో మీటర్ల దూరంలో ,కరీంనగర్ నుండి 40కిలో మీటర్ల దూరంలో,సిద్దిపేట్ నుండి 38 కిలో మీటర్ల దూరంలో మరియు కామారెడ్డి నుండి 56 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఇది 10కిలో మీటర్లు చారిత్రాత్మిక వేములవాడ ఆలయ పట్టణం నుండి దూరంగా.

కనెక్టివిటీ :

ఎన్‌హెచ్ 365 బి నెంబర్ ఉన్న కొత్త జాతీయ రహదారి సిరిసిల్లను సిద్దిపేట్ ,జనగావ్,సూర్యపేట్ మరియు రాష్ట్రంలో ఇతర జిల్లాలతో కలుపుతుంది.హైదరబాద్ కు  ఉత్తరాన 140కిలోమీటర్ల దూరంలో హైదరబాద్ వేములవాడ రహదారి ఉంది